రూ. 50 వేల పానీపూరీని ఫ్రీగా పంచేశాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

రూ. 50 వేల పానీపూరీని ఫ్రీగా పంచేశాడు..

September 14, 2021

అప్పుడే కన్ను తెరిచిన పసిగుడ్డును ఆడపిల్ల అనే కారణంతో చెత్తకుప్పల్లో పడేసి వెళ్ళే దుర్మార్గులు ఉన్న ఈ కాలంలో ఓ తండ్రి తనకు ఆడపిల్ల పుట్టిందని తెలియగానే ఆనందంతో ఎగిరి గంతేశాడు. తన ఇంటికి సాక్షాత్తూ మహాలక్ష్మీ వచ్చిందని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఈ ఆనందాన్ని చుట్టూ ఉన్న వారితో పంచుకుని ఘనంగా వేడుకు పంచుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన పానీపూరి వ్యాపారి అంచల్ గుప్తాకు ఇటీవల కూతురు పుట్టింది. పుత్రికోత్సాహాన్ని పంచుకోడానికి అతడు అందరినోరు తీపి చెయ్యకుండా మాసాలా చేశారు. ఏకంగా రూ.50 వేల పానీపూరిని నగరవాసులకు, తన కష్టమర్లకు ఉచితంగా అందించాడు.

‘‘కుమార్తెలతోనే భవిష్యత్తు. ఆడపిల్లలు మగపిల్లలతో సమానం.. లింగ వివక్షను నిర్మూలించాలి.. ’ అని అన్నాడు అచల్. మహిళలు పురుషులకు ఏమాత్రం తక్కువ కాదని చెప్పాడు.వాళ్ళని తక్కువగా చేయడం హేయమని పేర్కోన్నాడు. ఆడపిల్ల పుట్టిన కూడా ఏ మాత్రం నిరుత్సాహం లేకుండా గుండెలకు హత్తుకొని స్వాగతించిన తీరును పలువురు మెచ్చుకున్నారు. చుట్టూ ఉన్న ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.