Strict rules if bike is given to minors
mictv telugu

వాళ్లకు బైక్ ఇస్తే..మీరు జైలుకే

November 12, 2022

Strict rules if bike is given to minors

మీ పిల్లలకు, మైనర్‌లకు మీ బైక్, కారు ఇచ్చేస్తున్నారా ? అలా వెళ్లి తిరిగేసి రండి అంటున్నారా ? అలా అయితే ఇక మీరు జైలుకెళ్లడం ఖాయం. దేశంలో రోడ్డుప్రమాదాలపై కేంద్రం దృష్టిసారించింది. ట్రాఫిక్స్ రూల్స్ ని కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా మైనర్లు వాహనం నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయనే భావనతో కఠిన నిబంధనలను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఎలా ఉన్నా ఇక నుంచి పక్కాగా అములు చేయాలని చెప్తోంది.

కొత్త రూల్స్ ప్రకారం వాహనం నడుపుతూ మైనర్లు పట్టుబడితే సదరు వాహనదారుడికి భారీ జరిమాన విధిస్తారు. ఇందుకు కోసం రూ.25 వేలు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా కేవలం 15 రోజుల్లోనే చెల్లించాలి. పట్టుబడ్డ ఆ మైనర్‌కు పాతికేళ్లు వచ్చేదాకా దేశంలో ఏ ఆర్టీఏ కార్యాలయంలోనూ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చే అవకాశం ఉండదు. ఇక మైనర్ వాహనం నడుపుతూ యాక్సిడెంట్ చేస్తే మూడేళ్ల జైలుశిక్ష విధించే అవకాశం ఉంది. వాహనం యజమానికీ జరిమానా, మూడేళ్ల జైలు విధించే అవకాశం కూడా ఉంది. ఇన్నాళ్లు చూసి చూడనట్లు వ్యవహరించిన పోలీసులు ఇప్పుడు ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నారు. కఠిన నిబంధనలు, ప్రమాదాలు దృష్ట్యా ఇకనైనా పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్త పడితే మంచింది.