సింగరేణిలో మోగిన సమ్మె సైరన్ - MicTv.in - Telugu News
mictv telugu

సింగరేణిలో మోగిన సమ్మె సైరన్

March 14, 2022

mmm
సింగరేణిని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్మికులు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సమ్మెకు సిద్ధమయ్యారు. ప్రాంతీయ లేబ‌ర్ క‌మిషన‌ర్‌‌తో చేపట్టిన చర్చలు విఫలం కావడంతో కార్మికులు ఈ నెల 28, 29 తేదీల్లో సమ్మెను చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా సోమవారం ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, ఐఎన్టీయూసీ కార్మిక సంఘాలు సింగరేణి యాజమాన్యానికి నోటీసులు అందించాయి.

మరోపక్క సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణపల్లి బ్లాక్, కొయ్యగూడెం బ్లాక్, కళ్యాణిఖని బ్లాక్ 6లను కేంద్రం ప్రభుత్వం వేలం వేయడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు సమ్మె సైరన్ మోగించాయి. ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తున్నాయి. నాలుగు బొగ్గు బ్లాకులను కేంద్రం వేలం వేయాలని చూస్తుండంతో ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు సింగరేణి కార్మికులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతంలో డిసెంబర్ 9 నుంచి మూడు రోజుల పాటు సమ్మె నిర్వహించి, తమ వ్యతిరేకతను వ్యక్తపరిచారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తే సమరమే అంటూ కార్మికులు కేంద్రానికి హెచ్చరికలు  జారీ చేస్తున్నారు.