షర్ట్, ప్యాంట్ విప్పి కర్రలతో కొట్టారు: సాంబశివరావు - MicTv.in - Telugu News
mictv telugu

షర్ట్, ప్యాంట్ విప్పి కర్రలతో కొట్టారు: సాంబశివరావు

July 2, 2022

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డి పాలన, విధానాలు నచ్చక వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి వై.ఎస్.విజయమ్మ రాజీనామా చేసినట్టు సామాజిక మాధ్యమాల్లో లేఖను పోస్టు చేశారన్న అభియోగంపై సీఐడీ పోలీసులు ధరణికోటకు చెందిన వెంకటేష్‌తోపాటు నకరికల్లుకు చెందిన సాంబశివరావు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ లేఖకు సంబంధించి పోలీసులు తనను చిత్రహింసలు పెట్టారని, శుక్రవారం టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో కన్నీరు మున్నీరు అయ్యాడు. పోలీసులు చేయని తప్పుకు తనను చిత్రహింసలు పెట్టారని మీడియా పలు విషయాలను వెల్లడించాడు.

”నా షర్ట్, ప్యాంట్ తీసేసి, మోకాళ్లపై కూర్చోబెట్టి ఎస్సై జయకృష్ణ. కానిస్టేబుల్ శ్రీనివాసులు మోకాళ్లపై కర్రలతో కొట్టారు. వెంకటేష్ పెట్టిన పోస్టును నువ్వే తయారుచేశావా రా? అంటూ ఎస్సై జయకృష్ణ. కానిస్టేబుల్ శ్రీనివాసులు మోకాళ్లపై కర్రలతో కొట్టారు. మళ్లీ లేపి గోడకుర్చీ వేయించారు. కాసేపు అటు, ఇటూ నడిపించారు. నా ల్యాప్ టాప్ తెప్పించి, పాస్వర్డ్ ఎంటర్ చేసి మెయిల్ ఓపెన్ చేయమన్నారు. కంగారులో చేయలేకపోయా.. లక్ష్మణ్ అనే సీనియర్ పోలీసు అధికారి నా గుండెలపై గుద్దారు. నేను బాధతో గట్టిగా అరిచా.. నాటకాలేస్తున్నావురా అంటూ దుర్భాషలాడారు” అని ఆయన అన్నారు.

సాంబశివరావు.. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లుకు చెందిన వాసి, టీడీపీ సామాజిక మాధ్యమ విభాగంలో ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తున్నారు. గతకొన్ని రోజులక్రితం సోషల్ మీడియాలో వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి వై.ఎస్.విజయమ్మ రాజీనామా చేసినట్టు ఓ పోస్ట్ తెగ వైరల్ అయింది. ఆ పోస్ట్ ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు? అనే దానిపై పోలీసులు తెగ ఆరా తీశారు. ఈ క్రమంలో వెంకటేష్ అనే వ్యక్తితోపాటు సాంబశివరావుపై అనుమానించిన పోలీసులు అర్థరాత్రి సాంబశివరావు ఇంటికెళ్లి విచారణ పేరుతో అతడిని కొట్టినట్లు మీడియా ముందు వెల్లడించారు.