ప్రజలను భయపెడుతున్న బావి..  - MicTv.in - Telugu News
mictv telugu

ప్రజలను భయపెడుతున్న బావి.. 

October 14, 2019

  Well.

ఓ మంచినీటి బావి స్థానికులను భయపెడుతోంది. అందులోంచి వస్తున్న వింత శబ్ధాలను విన్న ప్రజలు తీవ్ర ఆందోళన చెంతున్నారు. వాటిని విన్న స్థానికులు ఏ ఉపద్రవం ముంచుకు వస్తుందోనని భయంతో ఏకంగా ఊరు విడిచి వెళ్లిపోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని పిపరీ గ్రామంలో ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడంలేదని స్థానికులు చెబుతున్నారు. అధికారులు కూడా బావికి దగ్గరగా ఎవరూ వెళ్లకుండా ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. 

బావిలో లోతుగా స్వరంగం ఉండి ఉంటుందని ఆ గ్రామ సర్పంచ్ రామ్ నరేష్ యాదవ్ చెబుతున్నాడు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా అది బయటపడి అందులోంచి శబ్ధాలు వస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. భూకంపం తరహా ప్రకంపనలు కూడా అక్కడ వస్తున్నాయని చెబుతున్నారు. దీంతో అక్కడి సమస్యను స్థానికులు  ఉన్నతాధికారులకు తెలిపారు. అసలు భావిలో శబ్ధాలు రావడానికి కారణం ఏంటనే విషయంపై నిపుణులతో పరీక్షలు జరిపిస్తామని అధికారులు చెబుతున్నారు.