అమెరికాలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య

తెలంగాణకు చెందిన రాజవంశీరెడ్డి మద్దసాని అనే 19 ఏళ్ల యువకుడు అమెరికాలో ఆత్మహత్య చేసుకున్నాడు. మిచిగన్ యూనివర్సిటీలో చదువుకుంటున్న అతడు వర్సిటీ హాస్టల్లోని తన గదిలో ఉరివేసుకుని చనిపోయాడు. అయితే ఇది అనుమానాస్పద మరణం కింద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజవంశీ కొన్ని నెలల కిందటే ఫ్లోరిడా నుంచి వచ్చి వర్సిటీలో చేరాడు. రాజవంశి ఆత్మహత్య వివరాలను అమెరికా అధికారులు అతని తల్లిదండ్రులకు తెలిపారు. భౌతిక కాయాన్ని తెలంగాణకు తీసుకెళ్లేందుకు అమెరికాలోని తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం డెట్రాయిట్(టీడీఎఫ్టీ) సహాయ నిధిని ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రానికి 1200 డాలర్లు అందాయి. మధ్యతరగతికి చెందిన రాజవంశి తండ్రి ప్రభుత్వోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

SHARE