Student from Penukonda bags a job in Qualcomm with whooping salary of Rs. 1.7 crore
mictv telugu

ఏపీ విద్యార్థికి భారీ ఆఫర్..రూ.1.70 కోట్ల ప్యాకేజ్‌తో ఉద్యోగం

December 1, 2022

ఏపీకి చెందిన ఓ యువకుడు భారీ ప్యాకేజ్‌తో ఉద్యోగం సంపాదించాడు. ఏకంగా ఏడాదికి రూ.1.7 కోట్ల ఆఫర్‌తో క్వాల్‌కం(Qualcomm) కంపెనీలో జాబ్ లభించింది. సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం గొల్లపల్లికి చెందిన భార్గవ్‌కుమార్‌రెడ్డి అమెరికాలోని అరిజోనా యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. మరో నెలలో చదువు పూర్తికానుంది. ఇంతలోనే వచ్చిన క్యాంపస్ ఇంటర్వ్యూలో భార్గవ్‌ కుమార్‌రెడ్డి ఉద్యోగం పొందాడు. అతని నైపుణ్యాన్ని గుర్తించిన క్వాల్‌కామ్ కంపెనీ రూ. 1.70 కోట్ల ప్యాకేజీ అందజేసింది. చదువు పూర్తయ్యాక అతడు ఉద్యోగంలో చేరనున్నాడు. అధునాతన చిప్‌ల తయారీలో పనిచేయనున్నాడు. భార్గవ్ ప్రతిభను గుర్తించిన అరిజోనా యూనివర్సిటీ ఇప్పటికే రూ. 20 లక్షలు స్కాలర్‌ షిప్‌ అందిస్తుంది.

కుమారుడికి భారీ ప్యాకేజ్‌తో ఉద్యోగం లభించడంపై అతని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి అనుకున్నది సాధించాడని సంతోష పడ్డారు.ఇంత భారీ జీతంతో ఉద్యోగం వస్తుందని ఊహించలేదన్నారు. గతంలోను తమ కుమారుడి ప్రతిభ గుర్తించి తెలుగు రాష్ట్రాలతో పాటూ తమిళనాడులో ఉన్న విద్యా సంస్థలు ఫీజుల్లో పెద్ద ఎత్తున రాయితీ ఇచ్చాయని తెలిపారు.