Student Killed By Hitting School Bus At Ibrahimpatnam Rangareddy
mictv telugu

చిన్నారులపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు.. స్పాట్ డెడ్

September 13, 2022

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది. నడుచుకుంటూ స్కూల్‌కు వెళ్తున్న విద్యార్థులపై ఆంగ్లిష్ట్ స్కూల్ బస్సు దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే విద్యార్థి మృతి చెందగా, మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం శేరిగుడ గ్రామం పరిధిలో సాగర్ హైవే పై చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.

వివరాల్లోకి వెళ్లితే.. బీహార్ రాష్ట్రనికి చెందిన కూలీలు వృత్తిరీత్యా రైస్ మిల్ లో హమాలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. రోజులాగే యధావిధిగా ఉదయం ఎనిమిది గంటల సమయంలో పిల్లలు ఇంటి నుండి పాఠశాలకు బయలుదేరారు. ఈ క్రమంలో శేరిగుడా వద్ద గల యూటర్న్ కు చేరుకోగానే అదే సమయంలో ఆంగ్లిష్ట్ స్కూలు బస్సు… యూటూర్న్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులపైకి అతివేగంగా దూసుకెళ్లడంతో విద్యార్థిని కాజల్ అక్కడిక్కడే మృతి చెందింది. చిన్నారి మృతదేహంతో బంధువులు రోడ్డుపై బైటాయించగా.. తీవ్రగాయాలతో ఉన్న విద్యార్థిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వ్యాన్ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు