Student makes it to India Book of Records after making life-size vintage car from thermocol
mictv telugu

థర్మాకోల్ తో అతి పెద్ద కారును తయారుచేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు!

February 21, 2023

Student makes it to India Book of Records after making life-size vintage car from thermocol

లక్నోకి చెందిన శివమ్ సింగ్ ఒక గదిలో పట్టేంత థర్మాకోల్ కారు అది కూడా వింటేజ్ కారును తయారు చేశాడు. ఇప్పుడు అది రికార్డుల్లోకి ఎక్కింది. మరి ఆ కారు గురించి, దాన్ని తయారు చేసిన వ్యక్తి గురించి తెలుసుకోకపోతే ఎలా?

కలలను సాకారం చేసుకోవడానికి కష్టపడాలి. అప్పుడే దాన్ని మనం ఎలాగైనా సాధిస్తాం. లక్నోకి చెందిన శివం సింగ్ విజువల్ ఆర్ట్స్ లో మాస్టర్స్ చేస్తున్నాడు. అతనికి ఎప్పటి నుంచే వింటేజ్ అదేనండీ పాత కాలపు కార్లంటే మక్కువ. అదే మోడల్ తో థర్మకోల్ తో తయారుచేశాడు. ఇప్పుడది ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లో పేరు నమోదు చేసుకున్నాడు.

హాస్టల్ రూమ్ లోనే..

బగ్గెటి కారు తయారు చేయడానికి థర్మాకోల్ ను ఎంచుకున్నాడు శివం. ఆర్ట్స్ కాలేజ్ క్యాంపస్ లోని బాయ్స్ హాస్టల్ లో ఈ కారును రూపొందించాడు. ఇది తయారు చేయడానికి చాలా కష్టాలు పడ్డాడు శివం. దీనికోసం మాల్ లో పార్ట్ టైమ్ ఉద్యోగం చేశాడు. అలా చేస్తేనే తన డ్రీమ్ ప్రాజెక్ట్ పూర్తయిందంటాడు శివం. నెల రోజుల పాటు దాదాపు 20వేల రూపాయాలను ఖర్చు చేసి ఈ కారును తయారు చేశాడు. ఆరడుగుల పొడవు, ఏడడుగుల వెడల్పు, 20 అడుగుల లెంగ్త్ తో ఈ కారును రూపొందించాడు.

నాలుగు సంవత్సరాల కష్టం..

2018లో విజువల్ ఆర్ట్స్ లో జాయినయ్యాడు శివం. తనకు చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడం అంటే ఇష్టం. అలా బొమ్మలు తయారు చేయాలని అనుకునేవాడు. అయితే తను ఎప్పుడైనా యూనిక్ గా ఉండాలని కోరుకునేవాడిని. అందుకే ఈ యూనిక్ కాన్సెప్ట్ తీసుకొని కారును తయారుచేశాడు. ‘నాలుగు సంవత్సరాలు కష్టపడి డబ్బును కూడబెట్టి మరీ ఈ ప్రాజెక్ట్ పూర్తి చేశాను. ఇదే కాలేజ్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేయాలని ఆలోచనలో ఉన్నాను. ఈ థర్మకోల్ కోసం 35కి.మీ.లు నడిచి వెళ్లి అక్కడ ఫ్యాక్టరీలో కొన్నాను. దానికి కారణం నా దగ్గర డబ్బులు లేకపోవడమే. ఇక బగ్గటీ కారు ఎంచుకోవడానికి అప్పట్లో ఈ కారు రాయల్టీకి సింబల్. నాన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తాడు. అమ్మ ఇంటి పనుల్లో ఉంటుంది. ఇక నేను ఈ కారు తయారుచేసేందుకు నా రూమ్మెట్ చాలా సహాయం చేశాడు. అతనికి కూడా నా కృతజ్ఞతలు’ అంటూ తెలియచేశాడు శివం.