ఆన్‌లైన్ క్లాసులు అర్థమవ్వటం లేదు.. విద్యార్థిని మృతి - MicTv.in - Telugu News
mictv telugu

ఆన్‌లైన్ క్లాసులు అర్థమవ్వటం లేదు.. విద్యార్థిని మృతి

September 21, 2020

gdfgbh

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. దీంతో కొన్ని విద్యాసంస్థలు ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయి. అయితే కొందరు విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు అర్థం కావడం లేదు. దీంతో ఒత్తిడికి గురుతువున్నారు. తాజాగా ఆన్‌లైన్ తరగతులు అర్థం కాక ఓక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తమిళనాడులోని తిరవల్లూరు జిల్లా పొన్నెరీ అరుమంతై గ్రామంలో జరిగింది. 

చెన్నైలోని భారతీ ఉమెన్స్ కళాశాలలో బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న దర్శిని ఇంటి దగ్గర ఉంటూ ఆన్‌లైన్ తరగతులు వింటోంది. ఆ క్లాసులు తనకు అర్థం కావడంలేదంటూ తల్లి దగ్గర వాపోయింది. ఆ తల్లి సర్దిచెప్పినా దర్శిని ఒత్తిడి తగ్గలేదు. క్లాసులు అర్థం కావడంలేదని, అందరిలా తాను చదువుకోలేకపోతున్నానని బాధపడేది. తరగతిలో వెనుకపడిపోతానని బాధతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై చోళవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.