Student suffers head injury in Basra IIIT
mictv telugu

లక్ష్మీ పంప్‌హౌస్ మోటార్లు.. ఎలా దెబ్బతిన్నాయో చూడండి

August 12, 2022

Lakshmi Pumphouse Motors is seen

భారీ వర్షాలు, భీకరంగా ప్రవహించిన గోదావరి వరదతో కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంప్‌హౌస్ నీట మునిగిన విషయం తెలిసిందే. అప్పటినుంచి బయటి వ్యక్తులను, మీడియాను, రాజకీయ నేతలను అక్కడికి అనుమతించలేదు. ఎంతమేర దెబ్బతిన్నది, తాజా పరిస్థితి ఏంటన్నది గోప్యంగా ఉంచారు. అయితే గురువారం అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు బయటికి వచ్చాయి. ఈ నెల 6వ తేదీ నాటికి నీటిని తోడేసి, ప్రస్తుతం బురద తొలగింపు, క్లీనింగ్ పనులు జరుగుతున్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు.

కాగా, గత నెల 14న చరిత్రలో ఎన్నడూ లేనంత వరద గోదావరికి వచ్చింది. కాళేశ్వరం వద్దనైతే సుమారు 16.90 మీటర్ల ఎత్తుతో 29 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. దీంతో అప్రోచ్ కెనాల్, హెడ్ రెగ్యులేటరీ, బ్రెస్ట్ వాల్ కూలిపోయి వరద నీరు మోటార్లు, పంపులపై పోటెత్తింది. అదే సమయంలో బరువులు ఎత్తేందుకు అమర్చిన 220 టన్నుల బరువు కలిగిన క్రేన్‌లు, రెండు లిఫ్టులు, రెండు ఐరన్ నిచ్చెనలు విరిగి పడ్డాయి. ఈ దెబ్బకు ఆరు మోటార్లు పూర్తిగా దెబ్బతినగా, విదేశాల నుంచి తెచ్చిన మోటార్లు కావడంతో వాటి మరమ్మత్తులకు అక్కడి నుంచే టెక్నీషియన్లు రావాల్సి ఉంది. ఇక వరద తగ్గుముఖం పడితే రక్షణ గోడను పంప్ హౌస్ పొడవునా నిర్మించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీని వల్ల భవిష్యత్తులో ఎంత వరద వచ్చినా తట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు.