Student Suicide in Basara Triple IT
mictv telugu

బాసర ట్రిపుల్ ఐటీలో స్టూడెంట్ సూసైడ్

August 23, 2022

వసతుల లేమితో ఇటీవల ఆందోళనతో వార్తల్లో నిలిచిన బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న సురేశ్ అనే స్టూడెంట్ హాస్టల్‌లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడగా, ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఉరికి వేలాడుతున్న సురేశ్‌ని చూసిన తోటి విద్యార్ధులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి సురేశ్ స్వగ్రామం. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంకా పూర్తి సమాచారం అందవలసి ఉంది. అటు ఈ ఘటనతో క్యాంపస్‌లో విద్యార్ధులు ఆందోళనకు దిగారు. విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నా అధికారులు స్పందించడం లేదని ఆగ్రహంతో పోలీస్ వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.