Students.. Admit cards from today
mictv telugu

విద్యార్థుల్లారా.. నేటి నుంచే అడ్మిట్ కార్డులు

July 12, 2022

 

దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సులు అయిన ఎంబీబీఎస్, దంత విద్యా కోర్సులు చదవాలని ప్రవేశ పరీక్ష కోసం ఎదురుచూస్తున్న విద్యార్ధినీ, విద్యార్థులకు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్-యూజీ) ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. నేటి నుంచే నీట్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in.నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.

అధికారులు మాట్లాడుతూ..”నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ 2022కు సంబంధించిన హాల్ టికెట్లు మంగళవారం నుంచి అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోండి. అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in. నుంచి అభ్యర్థులు ఉదయం 11.30 గంటల నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్ష ఈ నెల 17న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 వరకు ఉంటుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తునప్పటికి పరీక్ష మాత్రం జరుగుతుంది” అని అన్నారు. కావున అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పరీక్షకు  సిద్దం కావాలని కోరారు.