Students .. Applications for recounting from tomorrow
mictv telugu

విద్యార్థుల్లారా..రేపటి నుంచే రీకౌంటిగ్‌కు దరఖాస్తులు

June 29, 2022

తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థినీ, విద్యార్థులకు ఇంటర్ బోర్డు అధికారులు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. పరీక్ష పత్రాల రీకౌంటింగ్‌కు రేపటి నుంచే దరఖాస్తులు మొదలౌతున్నాయని, విద్యార్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.

ఇంటర్ బోర్డు అధికారులు మాట్లాడుతూ..”రేపటి నుంచి ఆన్‌లైన్‌లో ఇంటర్ పరీక్ష పత్రాల పునః పరిశీలనకు దరఖాస్తులు మొదలుకాబోతున్నాయి. ఈ నెల 30 నుంచి జులై 6లోపు విద్యార్థులు ఆప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ http://tsbie.cgg.gov.inను సందర్శించండి. పరీక్షపత్రాల రీకౌంటింగ్ కోసం ఒక్కో పత్రానికి రూ. 100 చొప్పున చెల్లించాలి. స్కాన్ చేసిన పరీక్ష పత్రాలతోపాటు వెరిఫికేషన్ కోసం ఒక్కో పత్రానికి రూ. 600 చొప్పున చెల్లించాలి” అని అన్నారు.

మరోపక్క తెలంగాణవ్యాప్తంగా ఇంటర్ ఫస్టియర్ తరగతులు జులై 11 నుంచి ప్రారంభించాలని బోర్డు కార్యదర్శిని ఆదేశించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు బుధవారం కాలపట్టికను విడుదల చేస్తామని బోర్డు కార్యదర్శి జలీల్ పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం(2022-23) రాష్ట్రంలో కొత్త జూనియర్ కళాశాలలు మంజూరు కాలేదని వారు వివరాలను వెల్లడించారు.