Students..Applications for Sems Olympiad are now open
mictv telugu

విద్యార్థుల్లారా..సెమ్స్ ఒలింపియాడ్‌కు దరఖాస్తులు షురూ

August 12, 2022

తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్ధినీ, విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. జాతీయ స్థాయిలో 1-12వ తరగతుల విద్యార్థులకు నిర్వహించే సెమ్స్ ఒలింపియాడ్ 2023కు సంబంధించిన దరఖాస్తులు ప్రారంభమైయ్యాయని పేర్కొన్నారు. గురువారం సెమ్స్ ఒలింపియాడ్‌కు సంబంధించిన పోస్టర్‌ను అధికారులతో కలిసి ఆమె ఆవిష్కరించారు.

”జాతీయ స్థాయిలో 1-12 తరగతుల విద్యార్థులకు నిర్వహించే సెమ్స్ ఒలింపియాడ్ 2023కు నేటి నుంచి సెప్టెంబరు 8 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. మొదటగా ప్రాథమిక పరీక్షలను విద్యార్థులు చదువుతున్న పాఠశాలల్లోనే నిర్వహిస్తాం. ఈ పరీక్షలు అక్టోబరు నుంచి డిసెంబరు వరకు దశల వారీగా ఉంటాయి. అందులో ప్రతిభ చూపిన వారిని మెయిన్‌కు ఎంపిక చేస్తాం. ఆ పరీక్షలు డిసెంబరు లేదా జనవరిలో జరుగుతాయి. నాలుగోసారి ఒలింపియాడను నిర్వహించబోతున్నాం. ప్రతిభావ తులకు రూ.కోటి విలువైన బహుమతులను అందజేస్తాం” అని ఒలింపియాడ్ కన్వీనర్ ఆరుకాల రామచంద్రారెడ్డి, కోఆర్డినేటర్ ఎస్ఎస్ రెడ్డిలు అన్నారు.

అనంతరం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..”రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభ గల విద్యార్ధినీ, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైనా వారికి కోటీ రూపాయల బహుమతులు అందజేస్తారు. మీ టాలెంట్‌ను నిరూపించుకోవడానికి ఇదొక మంచి వేదిక” అని ఆమె అన్నారు.