సోషల్ మీడియా, గూగుల్ వచ్చిన తర్వాత ఈ ఆధునిక కాలంలో గురువులకు గౌరవమిచ్చే విద్యార్ధులు బాగా తగ్గిపోయారు. ఇంతకు ముందు ఏం తెలియాలన్నా గురువే ద్వారా మాత్రమే తెలిసేవి. దాంతో టీచరు, విద్యార్ధుల మధ్య అవినాభావ సంబంధం ఉండేది. ఈ కాలంలో ఇలాంటివి కనిపించడం లేదన్న భావన ఎక్కువైంది. కానీ, దీనికి విరుద్ధంగా యూపీలో ఓ సంఘటన జరిగింది. బదిలీపై వెళ్తున్న తమ టీచరుపై అలవిమాలిన ప్రేమ పెంచుకున్న విద్యార్ధులు..
ఆయనను వెళ్లొద్దంటూ కన్నీరు పెట్టుకున్నారు. రాయ్గడ్ చందౌలీ ప్రైమరీ స్కూలులో ఈ అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. నాలుగేళ్ల క్రితం ఈ పాఠశాలలో టీచరుగా వచ్చిన శివేంద్రసింగ్ అనే వ్యక్తి.. పాఠాలు బోధించడంలో తన ప్రత్యేకత చాటారు. పాఠాలు మాత్రమే కాక, ప్రపంచ విషయాలు బోధించేవారు. అంతేకాక, పిల్లలతో కలిసి సమీపంలోని కొండ వద్ద క్రికెట్ ఆడేవారు. ఇలా పిల్లలతో పూర్తిగా మమేకం అవడంతో ఆ స్కూలులో హాజరుశాతం బాగా పెరిగింది. దీంతో టీచరు సేవలను గుర్తించిన ప్రభుత్వం గతంలో జిల్లా స్థాయి అవార్డుతో సత్కరించింది. ఈ క్రమంలో ఆయన సేవలు పక్క జిల్లాలో అవసరమవడంతో ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో పైసన్నివేశం కనిపించింది. విద్యార్ధులు ఏడుస్తుండగా, ‘నేను త్వరలో మళ్లీ వస్తా. బాగా చదువుకోండి. మీరంతా బాగుపడడమే నాకు కావాలి’ అంటూ వారిని ఓదార్చారు.
Video: At UP Teacher's Farewell, Students Weep, Refuse To Let Him Go https://t.co/H9vCNQK0aj pic.twitter.com/7o0dqECKe5
— NDTV (@ndtv) July 15, 2022