Students beat teachers in jarkhand
mictv telugu

మార్కులు తక్కువేసిన టీచర్లను చెట్టుకు కట్టేసి కొట్టిన విద్యార్ధులు.. వీడియో

August 31, 2022

సాధారణంగా మార్కులు తక్కువ వస్తే విద్యార్ధిని టీచర్లు కొడతారు. తర్వాత అయినా మంచిగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటాడనే ఉద్దేశంతో అలా దండిస్తారు. కానీ, విద్యార్ధులే టీచర్లను కొడితే.. జార్ఖండ్‌లో ఇలాంటి దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. గురువును దైవంగా భావించే దేశంలో గురువుపైనే స్టూడెంట్స్ దాడికి దిగారు. వివరాల్లోకెళితే.. దుంకా ప్రాంతంలోని ఓ గ్రామంలో ఇటీవల పై తరగతి విద్యార్ధులకు ప్రాక్టికల్స్ నిర్వహించారు.

అందులో చాలామందికి తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో ఆగ్రహించిన విద్యార్ధులు ఆగ్రహంతో టీచర్లను చెట్టుకు కట్టేశారు. బెత్తాలు, కర్రలు పట్టుకొని ఒళ్లు హూనమయ్యేలా కొట్టారు. తమ ఫెయిల్యూర్‌కి కారణమైన టీచర్లను ఇదేంది అని అడగితే సరైన స్పందన లేదని వివరించారు. మీడియా వెళ్లి టీచర్లను అడిగితే.. మార్కుల విషయం మాట్లాడుకుందాం రండి అని పిలిచి కొట్టారని వాపోయారు. పరీక్ష ఫలితాల్లో ప్రాక్టికల్స్ మార్కులు కలపకపోవడం వల్లే తమకు ఈ దుస్థితి వచ్చిందని, అందుకు కారణం ప్రధానోపాధ్యాయుడని ఆరోపించారు. ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని తేల్చి చెప్పారు. కాగా, ఈ ఘటనపై విద్యాధికారి మాట్లాడుతూ.. తమకు సమాచారం అందిందని, సమస్యపై టీచర్లతో మాట్లాడుతున్నట్టు వెల్లడించారు. అటు ఇందుకు సంబంధించిన వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.