Students .. books are ready
mictv telugu

విద్యార్థుల్లారా.. పుస్తకాలు రెడీ అయ్యాయి

June 25, 2022

తెలంగాణ రాష్ట్రంలో జూన్ 13వ తేదీ నుంచి విద్యా సంస్థలు ప్రారంభమైన విషయం తెలిసిందే. పాఠశాలలు ప్రారంభమై, 15 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు తెలుగు అకాడమీ నుంచి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందలేదు. దాంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. తాజాగా పాఠ్యా పుస్తకాల పంపిణీ విషయంపై ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ప్రచురణల డైరెక్టర్ శ్రీనివాస చారి శుభవార్తను చెప్పారు.

శ్రీనివాస చారి మాట్లాడుతూ..” తెలంగాణలో ఈనెల 27 నుంచి బహిరంగ మార్కెట్లోకి పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకటోవ తరగతి నుంచి పదోవ తరగతి వరకు అన్ని సబ్జెక్టుల పాఠ్య పుస్తకాలను విక్రయించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జిల్లా విద్యాధికారి నుంచి పర్మిషన్ రాగానే, అన్నీ కేంద్రాల్లో అమ్మాకాలు ప్రారంభమౌతాయి. ఈ పుస్తకాల పంపిణీ, అమ్మకాల కాంట్రాక్టును 13 ప్రైవేట్ సంస్థలకు అప్పగించాం. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకన్నా, ఎక్కువ ధరలకు పుస్తకాలను అమ్మితే, వెంటనే డీఈఓలకు ఫిర్యాదు చేయండి” అని ఆయన అన్నారు.

మరోపక్క అధికారులు ఈ ఏడాది నుంచి పాఠ్యపుస్తకాల్లో చాప్టర్ల వారీగా క్యూఆర్ కోడ్ ప్రచురించారు. ఈ క్యూఆర్ కోడ్లను విద్యార్థులు తమ స్మార్ట్ ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే, విద్యార్థులు ఆడియోల, వీడియోల రూపంలో పాఠ్యాంశాలను వినే విధంగా అవకాశాన్ని కల్పించారు. సులభంగా విద్యార్థులు పాఠ్యాంశాలను అర్థం చేసుకునేలా ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు అధికారులు తెలిపారు.