దేశవ్యాప్తంగా ఇంటర్ 12వ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) శుక్రవారం శెభవార్తను చెప్పింది. 12వ తరగతి ఫలితాలను కాసేపటిక్రితమే వెల్లడించింది.
ఈ ఫలితాలను విద్యార్థినీ, విద్యార్థులు అధికారిక వెబ్సైట్లు result,cbse,nic, in లేదా cbse. gov. in ద్వారా తెలుసుకోవాలని సూచించింది. వీటితోపాటు డిజిలాకర్, పరీక్షా సంగమ్ నుంచి కూడా ఫలితాలను తెలుసుకోవచ్చని పేర్కొంది. విద్యార్థులు తమ రూల్ నంబర్లు, స్కూల్ నంబర్లతో ఈ ఫలితాలను చెక్ చేసుకోచ్చని అధికారులు వివరాలను వెల్లడించారు.