Students.. CBSE Tenth Results tomorrow
mictv telugu

విద్యార్థుల్లారా..రేపే సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలు

July 12, 2022

దేశ్యావ్యాప్తంగా సీబీఎస్‌ఈ స్కూల్స్‌లో పదోవ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు సీబీఎస్ఈ బోర్డు ఓ శుభవార్తను తెలిపింది. రేపు పదో తరగతి ఫలితాలను వెల్లడిస్తామని ఓ ప్రకటన విడుదల చేసింది. కావున తెలుగు రాష్ట్రాల్లో సీబీఎస్‌ఈ స్కూల్లలో పదోవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://results.cbse.nic.in/లో తమ ఫలితాలను చెక్ చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.

ఇక, పరీక్షల విషయానికొస్తే.. ఏప్రిల్ 26 నుంచి మే 24 వరకు సీబీఎస్ఈ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా సుమారు 21 లక్షల మంది హాజరయ్యారు. ఈ క్రమంలో పరీక్షల మూల్యాంకనం పూర్తైన సందర్భంగా రేపు పరీక్షలను ఫలితాలను అధికారులు వెల్లడించనున్నారు. మరోపక్క సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు కూడా విడుదల కావాల్సి ఉన్నట్లు సీబీఎస్ఈ అధికారులు వివరించారు.