బస్సులో మద్యం తాగిన విద్యార్ధినీలు.. వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

బస్సులో మద్యం తాగిన విద్యార్ధినీలు.. వీడియో వైరల్

March 24, 2022

18

తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లాలో ప్రయాణంలో ఉన్న ఓ స్కూల్ బస్సులో పాఠశాల విద్యార్థులు మద్యం సేవించిన ఘటన సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతుంది. వీడియోలో ఓ పాఠశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు యూనిఫామ్‌ ధరించి, బస్సులో ప్రయాణిస్తున్నారు. వీరిలో కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి బీర్‌ బాటిల్‌ను ఓపెన్‌ చేసి, తాగుతూ కనిపించారు. దీంతో తోటి విద్యార్థులు ఆ దృశ్యాలను రికార్డ్‌ చేసి, సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

ఈ క్రమంలో వీడియో వైరల్ కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బస్సులోని విద్యార్థులంతా చెంగల్‌పట్టులోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. తిరుకజుకుండ్రం నుంచి తాచూర్‌కు వెళుతుండగా బస్సులో మద్యం తాగినట్లు తెలిపారు. ఈ ఘటన మంగళవారం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇలా విద్యార్థులు బస్సులో మద్యం సేవిస్తున్న విషయం చివరికి అధికారులు దృష్టికి వెళ్లడంతో.. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు.