Students drowned in anakapallli poodimadaka beach
mictv telugu

ఏపీ: సముద్రంలో కొట్టుకుపోయిన ఏడుగురు యువకులు

July 29, 2022

సరదాగా సముద్ర స్నానానికి వెళ్లిన యువకులు ఆచూకీ లేకుండా పోయారు. ఏడుగురు సముద్ర కెరటాల్లో కొట్టుకుపోగా ఒకరి మృతదేహం బయటపడింది. ఏపీలోని అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్ వద్ద శుక్రవారం ఈ విషాదం చోటుచేసుకుంది. అనకాపల్లి డైట్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన 15 మంది విద్యార్థులు విహార యాత్రగా పూడిమడక బీచ్‌ చేరుకున్నారు. ఒడ్డున సరదాగా స్నానం చేస్తూ కాస్త లోతుకు వెళ్లిపోయారు. అలలు బలంగా రావడంతో ఏడుగురు కొట్టుకుపోయారు. అక్కడే ఉన్న జాలర్ల సాయంతో పవన్ అనే విద్యార్థి మృతదేహాన్ని బయటికి తీశారు. తేజ అనే మరో విద్యార్థిని కాపాడా ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన ఐదుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.