కేక.. రెండు చేతులతో చకచకా రాసేస్తున్నారు! - MicTv.in - Telugu News
mictv telugu

కేక.. రెండు చేతులతో చకచకా రాసేస్తున్నారు!

October 30, 2019

బట్టి చదువులకు కాలం చెల్లింది. చాలా వరకు సృజనాత్మకతతో కూడిన విద్యవైపు చాలా మంది తల్లిదండ్రులు చూస్తున్నారు. దాదాపు చాలా వరకు పాఠశాలలు కూడా ఆ రకమైన విద్యాబోధన చేస్తున్నాయి. అలాగే హైదరాబాద్‌లోని వెంకటగిరిలో ఉన్న క్వీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో విద్యార్థులు టాలెంట్‌ను బయటపెడుతున్నారు. చాలా మంది విద్యార్థులు రెండు చేతులతో ఒకేసారి చకచకా రాసేస్తున్నారు. స్కూలులో ఇచ్చే ట్రైనింగ్ ద్వారా వీరు ఇలా చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. 

Students..

రెండు చేతులతో రాయగలిగే స్కిల్స్ నేర్పడం వల్ల విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుందని స్కూలు యాజమాన్యం చెబుతోంది. అందుకే డ్యూయల్ హ్యాండ్ రైటింగ్ ట్రైనింగ్‌ ఇస్తున్నట్టు తెలిపారు. దీని ద్వారా ఏకాగ్రత పెరిగి చదువుతో పాటు అన్ని పనుల్లో చురుగ్గా ఉంటారని అందుకే ఈ వినూత్న కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు  వెల్లడించారు. ఇలాంటి వాటిపై విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ చదువు మాత్రమే కాకుండా వారిలోని టాలెంట్‌కు పనిచెప్పడం మంచిదని భావిస్తున్నారు.