మరికొన్ని రోజుల్లోనే బోర్డ్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా టెన్త్, ఇంటర్ విద్యార్థులు బోర్డ్ ఎగ్జామ్ అనగానే భయంతో వణికిపోతుంటారు. అతిగా ఆలోచిస్తూ ఒత్తిడికి గురవుతారు. భవిష్యత్తు గురించి అనిశ్చితి కారణంగా చదువులపై దృష్టి సారించలేకపోతారు. పరీక్షల్లో ఫెయిల్ అవుతామేమో అని భయం వారిని నీడలా వెంటాడుతుంటుంది. ఒక ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి. ఇవన్నీ కూడా విద్యార్థుల మెదడులో మెదలుతుంటాయి. దీని ప్రభావం పరీక్షలలో ఫలితాలను ప్రభావితం చేస్తుంది. ఇది తరచుగా బోర్డు పరీక్షలు లేదా పోటీ పరీక్షలకు ముందు కనిపిస్తుంది.
గంటలతరబడి పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం, భవిష్యత్తు గురించి అనిశ్చితి కూడా దీనికి కారణం. వాస్తవానికి, విద్యార్థులు పోటీ పరీక్షలకు హాజరైనప్పుడు, వారిలో ఒత్తిడి మరింత తీవ్రంగా మారుతుంది. ఈ ఒత్తిడి వారి రోజువారీ కార్యకలాపాలకు కూడా ఆటంకం కలిగిస్తుంది. అటువంటి విద్యార్థులలో సర్వసాధారణమైన వచ్చే కంప్లైయిట్స్ ఎంటంటే… వారు దేనిపైనా ఏకాగ్రత, శ్రద్ధ చూపలేరు. ఇది ఎందుకు జరుగుతుంది.. పరిష్కారం ఏమిటి అని ఆలోచించరు. బోర్డ్ ఎగ్జామ్స్ కానీ కాంపిటేటీవ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే వారు ఈ చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే…పరీక్షల్లో విజయం సాధిస్తారు. అవేంటో చూద్దాం.
ఫెయిల్ అవుతామనే భయం :
ఏదో ఒక పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థిలోనూ ఇదే భయం కనిపిస్తుంది. ఎందుకంటే గంటలతరబడి చదువుతూనే ఉంటారు. ఇతర కార్యకలాపాలపై శ్రద్ధ చూపకుండా కేవలం పరీక్షపై దృష్టి సారించే హడావుడిలో ఉంటారు. కేవలం చదువు మాత్రమే కాదు అప్పుడప్పుడు సినిమాలు, పార్కులు, గేమ్స్ ఇలాంటి వాటికి కూడా కొంచెం సమయం కేటాయించాలి. ఎందుకుంటే చదవుకుంటూ ఇలా చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని సార్లు ఫెయిల్ అవుతామనే భయం వెంటాడుతుంది. ఇది వారిని శారీరకంగా ,మానసికంగా విచ్ఛిన్నం చేస్తుంది. ప్లాన్ ఎ విజయవంతం కాకపోతే, ప్లాన్ బి ఎలా ఉండాలనే దాని గురించి యువతకు ముందస్తు సన్నాహాలు లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది.
భావోద్వేగం:
శరీరం, మనస్సు రెండింటి ఆరోగ్యకరమైన అభివృద్ధికి సహాయపడుతుంది. బిజీ లైఫ్ కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు సమయం కేటాయించడం లేదు. ఇది పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పరీక్షల సమయంలో తల్లిదండ్రులు వారికి దగ్గరగా ఉండాలి. ఒంటరిగా ఉంచకూడదు. ఎందుకంటే పిల్లలు తప్పుడు మార్గాల్లో వెళ్లే అవకాశం ఉంటుంది.
పరిష్కారం కష్టం కాదు:
మానసిక సమస్య లేదా ఒత్తిడికి గురికాకుండా, ఏకాగ్రతతో మీ లక్ష్యం వైపు వెళ్లాలని మీరు కోరుకుంటే, ముందుగా మీ మనస్సు ,శరీర పనితీరును పెంచే టైమ్‌టేబుల్‌ను రూపొందించండి. లేదంటే చిన్నపాటి విరామాలు తీసుకుని చదవడం అలవాటు చేసుకోండి. ఇది మనస్సు, శరీరం రెండింటికి ఉపశమనం ఇస్తుంది. ఒకటి నుండి రెండు గంటల వరకు చదువు మధ్య 15 నుండి 20 నిమిషాల విరామం తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇది మిమ్మల్ని మళ్లీ శక్తివంతం చేస్తుంది.
మంచి ఆహారం తినండి:
పరీక్షల సమయంలో ఆరోగ్యానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలి. కొంతమంది విద్యార్థులు పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ తినడం మానేస్తారు. సమయానికి మంచి ఆహారం తీసుకోవాలి. ఆహారంతోపాటు నిద్రకు కూడా సమయాన్ని కేటాయించాలి. నిద్రకు సమయం కేటాయించకుండా రాత్రింబవళ్లు చదువుతూ కూర్చుంటే పరీక్షల సమయానికి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ప్రతిరోజూ శారీరక శ్రమల కోసం కొంత సమయం కేటాయించండి. సమయం దొరికినప్పుడు బంధువులతో మాట్లాడుతూ ఉండండి. ఇలా చేస్తే మీరు చాలా ఆందోళన, ఒత్తిడి సమస్య నుండి మిమ్మల్ని మీరు సులభంగా దూరంగా ఉంచుకోవచ్చు.