Students..gate notification next week
mictv telugu

విద్యార్థుల్లారా..వచ్చే వారం గేట్ నోటిఫికేషన్

July 28, 2022

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థినీ, విద్యార్థులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న గేట్ నోటిఫికేషన్‌కు సంబంధించి, అధికారులు మరో తాజా విషయాన్ని వెల్లడించారు. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)-2023 నోటిఫికేషన్ మరో వారం రోజుల్లో విడుదల కానుందని పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేయడానికి కాన్పూర్ ఐఐటీ అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు.

గేట్ ఉన్నతాధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం..”సెప్టెంబర్‌లో గేట్‌కు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ మొదలౌతుంది. 2023 ఫిబ్రవరి 4 నుంచి 13 తేదీల మధ్య పరీక్ష నిర్వహించాలని కాన్పూర్ ఐఐటీ నిర్ణయించింది. దేశంలోని ఐఐటీలో ఎంటెక్, పీహెచ్డీ కోర్పులు చేయడానికి ఈ గేట్ స్కోర్ కీలకమైంది. కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఈ గేట్ ర్యాంకు ఆధారంగానే ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాయి. వీటితో పాటు సంప్రదాయ డిగ్రీ కోర్సులు చేసిన అభ్యర్థులు కూడా గేట్ రాస్తారు. మొత్తం 29 సబ్జెక్టుల్లో నిర్వహించే ఈ పరీక్ష కోసం విద్యార్థులు ఏడాది నుంచే ప్రత్యేక శిక్షణ తీసుకుంటారు. గత ఏడాది 7.11 లక్షల మంది గేట్ రాశారు. వీరిలో 1.26 లక్షల మంది అర్హత సాధించారు” అని అన్నారు.

మరోపక్క ఏపీ, తెలంగాణలో కూడా గేట్ నోటిఫికేషన్ కోసం వేల మంది విద్యార్థులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బీటెక్ పూర్తి చేసుకున్నవారు, బీటెక్ ఫైనల్ ఇయ్యర్‌లో ఉన్నవారు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. మరికొంతమంది విద్యార్థులు కొన్ని నెలలుగా గేట్ పరీక్షకు కోచింగ్‌లు తీసుకొని, ప్రిపేరేషన్ కూడా స్టార్ట్ చేశారు. ఇటువంటి సమయంలో విద్యార్థులకు అధికారులు తీపికబురు చెప్పారు.