విద్యార్థుల్లారా..ఈ కోర్సులు చదివితే ఉద్యోగం గ్యారెంటీ! - MicTv.in - Telugu News
mictv telugu

విద్యార్థుల్లారా..ఈ కోర్సులు చదివితే ఉద్యోగం గ్యారెంటీ!

July 2, 2022

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల విద్యార్థులకు అధికారులు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. నేటి సాంకేతిక అవసరాలకు తగ్గట్టుగా, డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఉద్యోగాన్ని సంపాదించేలా పలు కోర్సులను ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చామని ఓ ప్రకటన విడుదల చేశారు. విడుదల చేసిన ప్రకటనలో.. ”ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్‌ లర్నింగ్ కోర్సుకు సంబంధించి ఇంజినీరింగ్‌ విద్యార్థులతోపాటు, ఈసారి బీఎస్సీ విద్యార్థులకు కూడా అవకాశం కల్పించారు. రాష్ట్రంలోని 11 ప్రభుత్వ అటానమస్ కాలేజీల్లో ఈ కోర్సును ప్రవేశపెట్టారు.

ఇవేగాక ఈ కామర్స్, గేమింగ్, గ్రాఫిక్ డిజైన్, యానిమేషన్ కోర్సులను ప్రవేశపెట్టారు. వీటి కరిక్యులం, కోర్సు మెటీరియల్‌ను సిద్ధం చేశారు. ఈ కోర్సులను అప్రెంటిషిప్ ఎంబెడెడ్ డిగ్రీ కోర్సులుగా వ్యవహరిస్తున్నారు. ఈ కోర్సుల్లో చేరేవారు ఏదైనా సంస్థలో ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఆ కాలానికి స్టైపెండ్ అందజేస్తారు. బీబీఏ రిటైల్ చేస్తున్నవారు రిటైల్ సంస్థలు, ఈ కామర్స్‌లో చేరిన వారు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఏ సంస్థలో చేయాలన్నది స్థానికంగా ఉండే సంస్థలను బట్టి అవకాశం కల్పిస్తారు. బీఏలో ఆనర్స్ కోర్సులను విస్తృతంగా అందుబాటులోకి తీసుకొస్తుండగా, తాజాగా ఈ విద్యాసంవత్సరం బీఏ ఆనర్స్-హిస్టరీ కోర్సు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ సిటీ కాలేజీలో ఈ కోర్సులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు”.

ఈ కోర్సులు చదివితే ఉద్యోగం గ్యారెంటీ..