స్మార్ట్ డస్ట్‌బిన్.. నోరు తెరిచి అడుక్కుంటుంది..  - MicTv.in - Telugu News
mictv telugu

స్మార్ట్ డస్ట్‌బిన్.. నోరు తెరిచి అడుక్కుంటుంది.. 

December 2, 2019

యువ విద్యార్థులు సృజనాత్మకకు పదును పెట్టి అసాధ్యమనుకున్న వాటిని సుసాధ్యం చేస్తున్నారు. రోబోటిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌.. ఇలా అనేక విభాగాల్లో తమ ఆలోచనలను ఆచరణలో పెట్టి కొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోస్తున్నారు. ఎన్నో సమస్యలకు సాంకేతికతతో పరిష్కారం చూపుతున్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో చెత్త సమస్య ఒకటి. దీనికి శాశ్వత పరిష్కారం చూపడానికి మోదీ సర్కార్ యుద్ధ ప్రాతిపదికన స్వచ్ఛ భారత్ అనే పథకాన్ని తీసుకొని వచ్నింది. తద్వారా దేశంలో ఉన్న చెత్త సమస్యకు చెక్ పెడుతోంది.

ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాజధాని జైపూర్‌‌లోని భారతీయ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ విద్యార్థులు ‘స్మార్ట్ డస్ట్‌బిన్’ రూపొందించారు. దానికి ‘హైటెక్ స్మార్ట్ ట్రాష్ కలెక్టర్’ అని నామకరణం చేశారు. ఎవరైనా ఆ డస్ట్‌బిన్ దగ్గరకు వెళితే.. సెన్సార్ గుర్తిస్తుంది. ఆ డస్ట్‌బిన్ దానంతట అదే తెరుచుకుంటుంది. ఇది రోబో తరహాలో ఒక ట్రాక్‌పై ఒకచోట నుంచి మరో చోటకు కూడా వెళ్లగలదు. దీనికి వైర్‌లెస్ కంట్రోల్స్‌ను అమర్చారు. ఎవరైనా దీనిని చోరీ చేస్తే వెంటనే యజమానికి సందేశం పంపుతుంది. దీనికి అమర్చిన జీపీఎస్ దొంగలను పట్టుకోవచ్చు. ప్రస్తుతం విద్యార్థులు తయారు చేసిన ప్రోటోటైపుకు రూ.1200 ఖర్చు అయింది. దీనిని మెట్రో స్టేషన్, ఎయిర్ పోర్ట్స్‌లో పెట్టడానికి తయారు చేశామని విద్యార్థులు తెలిపారు. ప్రభుత్వం లేదా ఏదైనా సంస్థ ముందుకు వచ్చి చేయుతనిస్తే వీటిని తయారు తక్కువ ధరకే ప్రజలకు అందిస్తామని విద్యార్థులు తెలిపారు.