విద్యార్థుల్లారా.. నేడే ఇంటర్ ఫలితాలు విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

విద్యార్థుల్లారా.. నేడే ఇంటర్ ఫలితాలు విడుదల

June 22, 2022

ఆంధ్రప్రదేశ్‌లోని ఇంటర్ విద్యార్థిని, విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు ఓ కీలక విషయాన్ని తెలియజేసింది. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను నేడు విడుదల కానున్నాయి అని అధికారులు తెలిపారు.

ఈ ఫలితాలను నేటి మధ్యాహ్నం 12.30 గంటలకు విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేస్తారని పేర్కొన్నారు. కావున ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ www.bie. ap gov. in, examresults. ap.nic.inలో ఫలితాలను చెక్ చేసుకోవాలని కోరారు.

ఇక, పరీక్షల విషయానికొస్తే.. రాష్ట్రవ్యాప్తంగా మే 6 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల మందికి పైగా విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ క్రమంలో నేడు ఫలితాలను వెల్లడించనున్నట్లు అధికారులు వివరాలను వెల్లడించారు.