Students..JEE Main Results Released
mictv telugu

విద్యార్థుల్లారా..జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల

August 8, 2022

దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్ధినీ, విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుభవార్తను చెప్పింది. కాసేపటిక్రితమే ఎన్టీఏ అధికారులు జేఈఈ మెయిన్ ఫలితాలను విడుదల చేశారు. జేఈఈ మెయిన్ ర్యాంకులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని తెలిపారు. అయితే, ఆదివారం ర్యాంకులను విడుదల చేయకుండా కేవలం ప్రొవిజనల్ ఫైనల్ కీని మాత్రమే విడుదల చేశామని, ఇప్పుడు ర్యాంకులను కూడా అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు.

ఇక, విడుదలైన ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్ధులు సత్తా చాటారు. పి. రవిశంకర్ ఆరోవ ర్యాంకు సాధించగా.. ఎం. హిమవంశీ ఏడు, పల్లి జయలక్ష్మి తొమ్మిదో ర్యాంకు దక్కించుకున్నారు. విద్యార్థులు ఈ జేఈఈ మెయిన్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్.. jeemain.nta.nic.inలో చెక్ చేసుకోవాలని అన్నారు.