Students..main-2 exams from today
mictv telugu

విద్యార్థుల్లారా..ఈరోజు నుంచే మెయిన్-2 పరీక్షలు

July 25, 2022

దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి జేఈఈ మెయిన్ – 2 పరీక్షలు ప్రారంభంకానున్నాయి. బీఈ, బీటెక్ విద్యార్థులకు ఈ నెల 25 నుంచి 29 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు ఇదివరకే తెలియజేశారు. అయితే, ఈ పరీక్షలకు సంబంధించి మరో తాజా విషయాన్ని అధికారులు వెల్లడించారు.

”ఈరోజు నుంచి 29వరకు దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో జేఈఈ మెయిన్ – 2 పరీక్షలు స్టార్ట్ కాబోతున్నాయి. పేపర్-1 బీఆర్క్, బీ ప్లానింగ్ విద్యార్థులకు 30న పరీక్ష ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలుంటాయి. ఈ పరీక్షలకు మొత్తం 6,29,778 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకొన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 30వేలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. 500 నగరాలు, విదేశాల్లోని 17 నగరాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నాం. గ్రేటర్ హైదరాబాద్ సహా పలు నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాం. కావున విద్యార్థినీ, విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైన అనుమతించం. హాల్ టికెట్‌తోపాటు మాస్కులు, శానిటైజర్స్ తప్పకుండా తెచ్చుకోవాలి” అని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.