విద్యార్థుల్లారా..ఈ నెల 23 నుంచి మెయిన్ పరీక్షలు - MicTv.in - Telugu News
mictv telugu

విద్యార్థుల్లారా..ఈ నెల 23 నుంచి మెయిన్ పరీక్షలు

June 15, 2022

జాతీయ పరీక్షల సంస్థ ఓ విద్యార్థులకు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. జేఈఈ మెయిన్ పరీక్షలకు సంబంధించి పరీక్ష తేదీలను అధికారులు మంగళవారం ప్రకటించారు. జేఈఈ మెయిన్ తొలిదశ పరీక్షలను ఈ నెల 23 నుంచి 29 వరకూ దేశ వ్యాప్తంగా 501 పట్టణాల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థికి పరీక్ష కేంద్రం ఏ పట్టణంలో కేటాయించారనే సమాచారాన్ని తెలిపే స్లిప్‌ను జేఈఈ మెయిన్ అనే వెబ్‌సైట్ నుంచి డౌన్లోడు చేసుకోవాలని సూచించారు. ఒకవేళ స్లిప్ డౌన్లోడ్ కాకపోతే, 01140759000 నంబర్‌కు ఫోన్ చేసి, వివరాలను తెలుసుకోవాలని ఎన్‌టీఏ అధికారులు వివరాలను వెల్లడించారు. అయితే, పట్టణం పేరు మాత్రమే ఈ స్లిప్‌లో ఉంటుందని, పరీక్ష కేంద్రం ఎక్కడనే వివరాలతో అడ్మిట్ కార్డు తరవాత జారీచేస్తామని ఎన్‌టీఎ వివరించింది.

దేశ వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటీల్లో ప్రవేశాల కోసం ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఈ జేఈఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ ఏడాదికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇప్పటికే విడుదలైంది. మొదటగా జూన్ 20, 21, 22, 23, 24, 26, 26, 27, 28, 29 తేదీలలో ఈ ఎగ్జామ్స్‌ నిర్వహించాలని షెడ్యూల్ విడుదల చేశారు. కానీ, తాజాగా జూన్ 23కు మార్చినట్లు ఎన్‌టీఏ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక, సెషన్‌ 1 కు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను ఎన్‌టీఏ ఈ వారంలో విడుదల చేయనుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు https://jeemain.nta.nic.in/ వెబ్‌సైట్‌ నుంచి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చుని తెలిపింది.