students missing in tirupathi
mictv telugu

తిరుపతిలో ఐదుగురు విద్యార్థులు అదృశ్యం

November 10, 2022

తిరుపతిలో ఐదుగురు విద్యార్థులు అదృశ్యం అవ్వడం సంచలనం కలిగించింది. ముగ్గురు విద్యార్థినిలు, ఇద్దరు విద్యార్థులు బుధవారం నుంచి కనిపించకుండా పోయారు. అదృశ్యమైనవారిలో మెహత, మౌనశ్రీ, గుణశ్రీ, అబ్దుల్‌ రెహమాన్‌ పదో తరగతి..అతిఫ్ తొమ్మిదో తరగతి చదువుతున్నారు. నెహ్రూ నగర్‌లోని అన్నమయ్య స్కూల్‌లో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు ట్యూషన్‌కు వెళ్లి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరక్క పోవడంతో పోలీసులను ఆశ్రయించారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్కూల్లో సీసీ ఫుటేజీలను పరిశీలించగా పిల్లలు ట్యూషన్‌ నుంచి ఇంటికి వెళుతున్నట్లుగా రికార్డయ్యింది. ఆ తరువాత విద్యార్థులు ఎక్కడికెళ్లారో అనేది తెలియలేదు. విద్యార్థుల సెల్‌ఫోన్ ఆధారంగా వారి ఆచూకీని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. సీసీఫుటేజ్‌ను పరిశీలిస్తున్నామని వెల్లడించారు.