Students.. MSET and ESET results released
mictv telugu

విద్యార్థుల్లారా.. ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాలు విడుదల

August 12, 2022

తెలంగాణ రాష్ట్రంలో గత నెలలో జరిగిన తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాలు కాసేపటిక్రితమే విడుదలయ్యాయి. విడుదలైన ఫలితాలలో 90.7 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాలను హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో ఆమె విడుదల చేశారు. పరీక్షాలు రాసిన విద్యార్థులు eamcet.tsche.ac.inలో ఫలితాలను చెక్ చేసుకోవాలని ఆమె తెలిపారు.

తెలంగాణ వ్యాప్తంగా గత నెల 18 నుంచి 20వ తేదీ వరకు ఎంసెట్‌, ఈసెట్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఇంజనీరింగ్‌ విభాగంలో 30,31 తేదీల్లో అగ్రి, మెడికల్‌ ఎంసెట్‌ జరిగగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌ విభాగానికి 1.52 లక్షల మంది, అగ్రి ఎంసెట్‌కు 80 వేలమంది విద్యార్థులు హాజరయ్యారు. గురువారం రోజున ఈ ఫలితాలకు సంబంధించి అధికారులు శుక్రవారం 11:29కి రిజల్ట్స్ విడుదల చేస్తామని చెప్పారు. చెప్పినట్లుగానే కాసేపటిక్రితమే ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాలను విడుదల చేశారు.