Students..MSET and ESET results tomorrow
mictv telugu

విద్యార్థుల్లారా..రేపే ఎంసెట్, ఈసెట్ ఫలితాలు

August 11, 2022

Students..MSET and ESET results tomorrow

తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్, ఈసెట్ పరీక్షలను రాసిన విద్యార్థినీ, విద్యార్థులకు అధికారులు గురువారం ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. శుక్రవారం ఉదయం 11.15 గంటలకు ఈసెట్, 11.45 గంటలకు ఎంసెట్ ఫలితాలను విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. కావున విద్యార్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రేపు ఫలితాలు విడుదలైన వెంటనే అధికారిక వెబ్‌సైట్‌ eamcet.tsche.ac.inలో ఫలితాలను చెక్ చేసుకోవాలని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా గత నెల 18 నుంచి 21 వరకు ఇంజినీరింగ్, 30, 31న అగ్రికల్చర్, ఫార్మా ఎంసెట్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఇంజినీరింగ్‌ పరీక్షకు 1,56,812 మంది, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల కోసం 80,575 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని ఎంసెట్ కన్వీనర్ ఎ. గోవర్ధన్ తెలిపారు. ప్రాథమిక సమాధానాలను ఇదివరకే విడుదల చేశామని, విద్యార్థుల నుంచి అభ్యంతరాలను కూడా స్వీకరించామని, తుది సమాధానాలతో పాటు ఫలితాలను ఎంసెట్ కమిటీ విశ్లేషించిందని ఆయన పేర్కొన్నారు. ఫలితాలను రేపు ఉదయం విడుదల చేయాలని అధికారులు నిర్ణయించినట్లు తాజా వివరాలను వెల్లడించారు.