Students..NEET PG Counseling on 1st September
mictv telugu

విద్యార్థుల్లారా..సెప్టెంబర్ 1న నీట్ పీజీ కౌన్సెలింగ్

July 25, 2022

దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) నీట్ 2022కు సంబంధించి, విద్యార్థినీ, విద్యార్థులకు మరో తాజా విషయాన్ని వెల్లడించింది. నీట్ పీజీ కౌన్సెలింగ్ సెప్టెంబరు 1 నుంచి ప్రారంభం కానుందని, నీట్-పీజీ 2022 పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు కౌన్సెలింగ్ సందర్భంగా ఆల్ ఇండియా కోటా సీట్ల కోసం కోర్సు, కళాశాలల ఆప్షన్లు ఇవ్వాలని ఓ ప్రకటనలో పేర్కొంది.

మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ విడుదల చేసిన ప్రకటనలో..”కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, డీమ్ యూనివర్సిటీలు, మెడికల్, డెంటల్ కళాశాలల్లోని 50 శాతం ఆల్ ఇండియా కోటా, 50శాతం రాష్ట్ర కోటా సీట్లను భర్తీ చేయనున్నాం. ఈ కౌన్సెలింగ్‌ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆధీనంలో ఉన్న మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) నిర్వహిస్తుంది. ఆగస్టు 15 నాటికి వైద్య కళాశాలల తనిఖీ ప్రక్రియను (ఎస్ఎంసీ) పూర్తి చేసి అనుమతి పత్రాలను ఇవ్వనుంది. అందువల్ల సెప్టెంబరు 1 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించాం. దీని వల్ల తొలి రౌండ్ కౌన్సెలింగ్ నాటికే కొత్త సీట్లన్నీ అందుబాటులోకి రానున్నాయి” అని అధికారులు ఆ ప్రకటనలో తెలిపారు.

వాస్తవానికి ప్రతిసారి అధికారులు..ఈ నీట్ పీజీ కౌన్సెలింగ్ జనవరిలో గాని మార్చిలో గాని నిర్వహిస్తారు. కరోనా కారణంగా గత సంవత్సరం నుంచి ప్రవేశాల ప్రక్రియలో ఆలస్యంగా జరుగుతోంది. ఈ ఏడాది మే 21న పరీక్ష నిర్వహించి, జూన్ 1న ఫలితాలను విడుదల చేశారు. 2021 విద్యా సంవత్సరంలో నీట్ సూపర్ స్పెషాలిటీ కౌన్సెలింగ్‌లో 748 సీట్లు మిగిలిపోయాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని సీట్లన్నీ భర్తీ చేయడానికి ఎటువంటి కటాఫ్ లేకుండానే స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నీట్ఎస్ఎస్ 2021 మార్ఆప్ రౌండ్ కౌన్సెలింగ్ మంగళవారం నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.