ప్రిన్సిపల్, వార్డెన్, అటెండర్ తమను వేధిస్తూ, దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ రోడ్డెక్కారు ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ స్కూల్ విద్యార్థినులు. తెల్లవారుజామున 5 గంటల నుంచి సుమారు 50 మంది విడ్యార్థినులు రోడ్లపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేసేంతవరకు కదిలేది లేదంటూ చలిలోనే భీష్ముంచుకు కూర్చున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలోని ఏకలవ్య మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్ జ్యోతిలక్ష్మి, వార్డెన్ రమ్య, అటెండర్ రామస్వామి తమను వేధిస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో బైఠాయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల డిమాండ్ చేశారు. నిరసన చేస్తున్న విద్యార్థినులకు విద్యార్థి సంఘాలు మద్దతు పలికారు. తమను వేధిస్తున్న వారికి తగిన బుద్ది చెప్పాలని చెలిని సైతం లెక్కచేయకుండా న్యాయం కోసం రోడ్డు పై బైఠాయించడం చర్చకు దారితీసింది. వారిని అధికారులు ఎంతగా వేధించి వుంటే విద్యార్థినులు సహనం కోల్పోయి వుంటారని స్థానికులు చెబుతున్నారు. వారిపై నమ్మకంతో పిల్లల తల్లిదండ్రులు వదిలి వెళితే.. ఇదే అలుసుగా భావించి ప్రిన్సిపల్ జ్యోతిలక్ష్మి, వార్డెన్ రమ్య, అటెండర్ రామస్వామి పిల్లలను వేధించడం సరైన పద్దతి కాదని చెబుతున్నారు. వారికి తగిన బుద్డి చెప్పాలని కోరుతున్నారు. విద్యార్థినులకు న్యాయం చేయాలని విజ్ఙప్తి చేస్తున్నారు.