Students..Policet results today
mictv telugu

విద్యార్థుల్లారా..నేడే పాలిసెట్ ఫలితాలు

July 13, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే పాలిసెట్ పరీక్ష రాసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థినీ, విద్యార్థులకు తెలంగాణ విద్యాశాఖ అధికారులు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. పాలిసెట్ పరీక్ష ఫలితాలను నేడు 11 గంటలకు వెల్లడిస్తామని అన్నారు. కావున ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్ధినీ, విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://polycetts.nic.in/ చెక్‌ చేసుకోవాలని సూచించారు.

విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ..”డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ పాలిసెట్ ఫలితాలు బుధవారం విడుదల అవుతాయి. ఉన్న తాధికారులు నాంపల్లిలోని సాంకేతిక విద్యాశాఖ కార్యాలయంలో 11 గంటలకు ఫలితాలను వెల్లడిస్తారు. పాలిసెట్‌ను జూన్ 30న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాం. ఈ పరీక్షకు ఈసారి 1,04,432 మంది (91.62 శాతం) విద్యార్థులు హాజరయ్యారు.” అని ఆయన అన్నారు.