నిర్మల్ జిల్లా బాసరలో ఉన్న ఆర్జీయూకేటీలో విద్యార్ధుల ఆందోళన రెండో రోజుకు చేరుకుంది. మెరుగైన భోజనం, ల్యాప్టాప్ల సరఫరా, సౌకర్యాల కొరత, యాజమాన్య నిర్లక్ష్యంపై విద్యార్ధులు తమ నిరసన కొనసాగించారు. కేసీఆర్ లేదా కేటీఆర్ వచ్చి స్వయంగా పరిశీలించి తమ సమస్యలను పరిష్కరించాలనే డిమాండుతో ఆరు వేల మంది విద్యార్ధులు ప్లకార్డులతో నిరసన తెలుపుతున్నారు. పై సమస్యలతో పాటు తెలంగాణ ఏర్పాటు నుంచి ఇప్పటివరకు శాశ్వత వీసీని నియమించకపోవడం, యూనిఫాం పంపిణీ లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. తమకున్న సమస్యలు తీరిస్తేనే ఆందోళన విరమిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్ధులు మెయిన్ గేటు వద్ద భారీగా చేరుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.