విద్యార్థుల్లారా.. రేపే టెన్త్ రిజల్ట్స్: బొత్స - MicTv.in - Telugu News
mictv telugu

విద్యార్థుల్లారా.. రేపే టెన్త్ రిజల్ట్స్: బొత్స

June 5, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు జరిగిన పదోవ తరగతి ఫైనల్ పరీక్షలకు సంబంధించి అధికారులు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. పదోవ తరగతి పరీక్ష ఫలితాలను రేపు (సోమవారం) విడుదల చేస్తామని పేర్కొన్నారు. రేపు( సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేస్తారని విద్యాశాఖ డైరెక్టర్ దేవానంద్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

ఫలితాలను రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత అధికారిక వెబ్ సైట్ bse.ap.gov.inలో చెక్ చేసుకోవాలని కోరారు. ఈ ఫలితాలను తొలుత శనివారం ఉదయం 11 గంటలకే విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. మంత్రి బొత్స, అధికారుల మధ్య సమన్వయ లోపంతో సీఎం కార్యాలయ ఆదేశాలతో ఫలితాలు వాయిదా పడ్డాయి. దాంతో ఫలితాల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూసిన విద్యార్థిని, విద్యార్థులు ఒక్కసారిగా నిర్ధాంతపోయారు.

మరోపక్క 2021-22 ఏడాదికిగానూ ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు జరిగిన టెన్త్ ఫైనల్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 6,21,799 మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు ఇది వరకే వివరాలను వెల్లడించారు. ఈ క్రమంలో రేపు పరీక్ష ఫలితాలను వెల్లడిస్తామని, తల్లిదండ్రులు, విద్యార్థులు 12 గంటల తర్వాత ఫలితాలను చూసుకోవాలని వివరాలను వెల్లడించారు.