Students..results after agri and medical exams
mictv telugu

విద్యార్థుల్లారా..అగ్రి, మెడికల్ పరీక్షల తర్వాతే ఫలితాలు

July 21, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ ఫలితాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని కన్వీనర్ ప్రొఫెసర్ ఏ గోవర్ధన్ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. రాష్ట్రంలో మిలిగిన అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలు ముగిసిన తర్వాతే ఎంసెట్ ఫలితాలను విడుదల కానున్నాయని ఆయన పేర్కొన్నారు. గత రెండవారాల క్రితం జరగాల్సిన ఈ పరీక్షలు రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా అధికారులు మరోసారి చర్చ జరిపి, ఈ పరీక్షల కొత్త తేదీలను ప్రకటించారు.

”ఈ నెల 30, 31 తేదీల్లో మిగిలిన అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలు జరుగనున్నాయి. ఆగస్టు రెండోవారంలో ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇక, ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిన్నటితో ముగిశాయి. బుధవారం రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించగా, 91.3 శాతం మంది హాజరయ్యారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో జరిగిన పరీక్షలకు మొత్తంగా 91 శాతం మంది విద్యార్థులు హాజరైయ్యారు. మొత్తం 1,72,273 విద్యార్థులకుగాను 1,56,812 పరీక్షలకు హాజరయ్యారు”  అని కన్వీనర్ ప్రొఫెసర్ ఏ గోవర్ధన్ తెలిపారు. మొదటి రెండు రోజుల్లో ఫిజిక్స్ మధ్యస్థం నుంచి సులభంగా ఉండగా, చివరి రోజు కఠినంగా ఉన్నట్టుగా నిపుణులు తెలిపారు.