ప్రస్తతం కాలేజ్ డేస్‌లో ప్రేమ వ్యవహారం సాధరణ విషయంగా మారిపోయింది. యువతి, యువకులు తెగ లవ్‌లో పడిపోతున్నారు. కొన్ని జంటలు సీక్రెట్‌గా మెయింటన్ చేస్తుంటే. మరికొందరు ప్రేమపేరుతో హద్దులు దాటుతున్నారు. అవకాశం దొరికితే పబ్లిక్ గానే రెచ్చిపోతున్నారు. తాజాగా కర్ణాటకలో ఓ జంట చేసిన పని తీవ్ర చర్చనీయాంశగా మారింది. గత వారం బెల్తంగడి పట్టణంలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ప్రతిపక్ష నేత సిద్ధారామయ్య హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి రాకతో కాలేజ్‌లో సందడి నెలకొంది. ఎవరి పనుల్లో వారు బిజీ బిజీగా ఉన్నారు. ఇదే సమయం అనుకున్న ఓ జంట.. కళాశాల అన్న సంగతి మరిచి రొమాన్స్‌కు దిగారు. కళాశాలలో ఒక పక్క సిద్ధారామయ్య కార్యక్రమం జరుగుతుంటే..వారు మాత్రం ఛాన్స్ వచ్చిందని రెచ్చిపోయారు. సరసాలలో మునిగితేలారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది కాలేజ్ యాజమాన్యం దృష్టికి వెళ్లగా వారిని సస్పెండ్ చేసింది.
అయితే ఈ వ్యవహారం ఉన్నటుండి మతపరమైన మలుపు తిరిగింది. అమ్మాయి హిందూ, అబ్బాయి ముస్లిం కావడంతో కొత్త వివాదం చెలరేగింది. హిందూ యువతితో రొమాన్స్ చేసినందుకు బాలుడిపై హిందూ కార్యకర్తలు బెదిరింపులకు దిగుతున్నట్లు సమాచారం. దాంతో పాటు హిందూ విద్యార్థినిని మాత్రమే కాలేజీ నుంచి సస్పెండ్ చేశారని హిందూ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. కానీ, ఇద్దర్నీ సస్పెండ్ చేసినట్లు కాలేజ్ యాజామాన్యం క్లారిటీ ఇచ్చింది. ఈ అంశంపై పోలీసులకు కళాశాల యాజమాన్యం పిర్యాదు చేయగా.. పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు.