Students.. Tenth results today
mictv telugu

విద్యార్థుల్లారా.. నేడే టెన్త్ రిజల్ట్స్

June 30, 2022

తెలంగాణ రాష్ట్రంలో నేడు పదోవ తరగతి పరీక్షల ఫలితాలను 11:30 గంటలకు విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా టెన్త్ రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న సుమారు 5 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని 11.30 గంటలకు రిజల్ట్స్‌ను అధికారిక వెబ్‌సైట్ bie.telangana.gov.in, bseresults.telangana.gov.inలో చెక్ చేసుకోవాలని కోరారు.

గత రెండేళ్లుగా రాష్ట్రంలో కరోనా కారణంగా టెన్త్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించలేదు. పరీక్షలను నిర్వహించకుండానే విద్యార్థులకు ఇంటర్నల్స్ ఆధారంగా మార్కులను కేటాయించి, పై తరగతులకు ప్రమోట్ చేసింది. అయితే, ఈసారి కరోనా తగ్గడంతో ఎస్ఎస్‌స్సీ బోర్డు టెన్త్ పరీక్షలను నిర్వహించింది. కానీ, ఈసారి పదోవ తరగతి ఎగ్జామ్స్‌కు సంబంధించి గతంలో 11 పేపర్లతో పరీక్ష నిర్వహించింది. ఈసారి కేవలం 6 పేపర్లకే ఎగ్జామ్స్‌ను అధికారులు నిర్వహించారు. అంతేకాకుండా పాఠ్యాంశాన్ని సైతం 30 శాతానికి తగ్గించారు. ఈ క్రమంలో గురువారం రోజున టెన్త్ ఫలితాలను వెల్లడిస్తామని తాజాగా సబితా ఇంద్రారెడ్డి అధికారిక ప్రకటన చేశారు. ఆ ప్రకారమే నేడు 11:30కి ఫలితాలను విడుదల చేయనున్నారు.