Students..the first step from today..these are the rules..
mictv telugu

విద్యార్థుల్లారా..ఇవాళ్టి నుంచే తొలిమెట్టు..రూల్స్ ఇవే..

August 15, 2022

Students..the first step from today..these are the rules..

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 23 వేల బడుల్లో ఇవాళ్టి నుంచే తొలిమెట్టు కార్యక్రమం మొదలుకానుంది. ఈ కార్యక్రమం 140 రోజులపాటు కొనసాగనుంది. ఈ తొలిమెట్టు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11.24 లక్షల మంది విద్యార్థులకు చదవడం, రాయడంలో కనీస సామర్థ్యాలను సాధించేలా అధికారులు శిక్షణ ఇవ్వడానికి సిద్దమైయ్యారు. ఇందులో భాగంగా విద్యార్ధినీ, విద్యార్థులు ఏ నిబంధనలు పాటించాలి అనే విషయాన్ని అధికారులు తెలియజేశారు.

”ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు నుంచి ‘తొలిమెట్టు’ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.. కరోనా టైంలో పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పడిపోయాయి. విద్యార్థులను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 140 రోజులపాటు 23 వేల బడులో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే 52,708 మంది టీచర్లకు ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది” అని అధికారులు తెలిపారు.

తొలిమెట్టులో చేసే పనులు, రూల్స్ ఇవే..

పిల్లలకు బేస్‌లైన్ టెస్టు నిర్వహించి, వారి అభ్యసన స్థాయిని గుర్తించడం. స్థాయికి అనుగుణంగా బోధనా ప్రణాళికలు సిద్ధం చేయడం. వార్షిక ప్రణాళిక, వారపు ప్రణాళిక, పాఠ్యప్రణాళిక, పీరియడ్ ప్రణాళికలు సిద్ధం చేయడం. తరగతి గదుల్లో పటిష్టమైన బోధనా ప్రణాళిక ప్రకారం బోధించడం.

అనంతరం వారంలో ఐదు రోజులు బోధించి, ఒక రోజు మూల్యాంకనం చేయడం. అన్ని తరగతులకు రోజూ గ్రంథాలయ పీరియడ్ ద్వారా పఠన కార్యక్రమాన్ని నిర్వహించడం. వరుసగా ఐదురోజులు పిల్లలు బడికి రాకుంటే వారి తల్లిదండ్రులతో మాట్లాడి కారణాలు తెలుసుకోవడం, నెలకొకసారి పిల్లల ప్రగతిని నమోదు చేయటం. కాంప్లెక్స్ స్థాయిలో ఉపాధ్యాయులవారీగా సమీక్ష నిర్వహించటం.. మండల స్థాయిలో నెలకొకసారి హెచ్ఎంలతో సమీక్ష. జిల్లా స్థాయిలో మండలాలవారీగా సమీక్ష. రాష్ట్రస్థాయిలో జిల్లాలవారీగా ప్రగతి సమీక్ష.