Students..UG results are here..this is the link
mictv telugu

విద్యార్థుల్లారా: యూజీ ఫలితాలు వచ్చేశాయి..లింక్ ఇదే

September 16, 2022

దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలకు సంబంధించి, ఇటీవలే నిర్వహించిన ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష(సీయూఈటీ)-యూజీ ఫలితాలను ఈరోజు వేకువజామునే అధికారులు విడుదల చేశారు. కనుక ఈ పరీక్షను రాసిన విద్యార్థినీ, విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ www.nta.ac.in https://cuet.samarth.ac.inలో ఫలితాలను చెక్ చేసుకోవాలని ఎన్టీఏ అధికారులు సూచించారు.

”దేశవ్యాప్తంగా ఈ పరీక్ష 259 పట్టణాల్లో 490 పరీక్షా కేంద్రాలతోపాటు విదేశాల్లోని 10 నగరాల్లో జరిగింది. మొత్తం ఆరు దశలుగా ఈ పరీక్షలు జరిగాయి. దాదాపు 14. 9 లక్షల మందికి పైగా దరఖాస్తులు చేసుకొగా, 9,68,201 మంది పరీక్షకు హాజరయ్యారు. తొలుత గురువారం రాత్రి 10 గంటలకు పరీక్ష ఫలితాలు వెలువడతాయని ప్రకటించాం. కానీ, కొన్ని కారణాలతో ఆలస్యం అయ్యింది. అందుకే ఈరోజు ఫలితాలను విడుదల చేశాం” అని ఎన్టీఏ అధికారులు తెలిజేశారు.

 

ఎన్టీఏ వెల్లడించిన వివరాల ప్రకారం..దేశవ్యాప్తంగా ఉన్న 44 సెంట్రల్ యూనివర్సిటీలు, 12 స్టేట్ యూనివర్సిటీలు, 11 డీమ్ యూనివర్సిటీలు, 19 ప్రయివేటు వర్సిటీలతో కలిపి దేశవ్యాప్తంగా 99 విశ్వవిద్యాలయాల్లో గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం తొలిసారిగా ఈ పరీక్షను నిర్వహించారు. తుది ఆన్సర్ ‘కీ’ ఆధారంగా ఈ ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలను www.nta.ac.in https://cuet.samarth.ac.in వెబ్ సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. మరోవైపు, యూనివర్సిటీలు కొత్త విద్యా సంవత్సరాన్ని అక్టోబర్ ఆఖర్లో లేదా నవంబర్ తొలివారం నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్టు యూజీసీ చైర్మన్ ఎం. జగదీశ్ కుమార్ తెలిపారు.