Students..UGC NET exam postponed
mictv telugu

విద్యార్థుల్లారా..యూజీసీ నెట్ పరీక్ష వాయిదా

July 9, 2022

Students..UGC NET exam postponed

భారతదేశ రాజధాని ఢిల్లీలో ఉన్న యూనివర్సటీ గ్రాంట్స్ కమీషన్ విద్యార్ధినీ, విద్యార్థులకు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. దేశవ్యాప్తంగా నేటి నుంచి జరగాల్సిన యూజీసీ నెట్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. కాబట్టి ఈరోజు తెలుగు, మరాఠి పేపర్లు రాసే విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరారు.

”దేశవ్యాప్తంగా ఈ నెల 9న నిర్వహించే యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాయిదా వేసింది. ఈరోజు తెలుగు, మరాఠి పేపర్లలో నెట్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. కానీ, ఇదేరోజు ఏపీ, తెలంగాణలో ఇతర పరీక్షలు ఉన్నాయి. ఆ కారణంగా పరీక్షా కేంద్రాల సమస్య తలెత్తింది. దాంతో ఎన్టీఏ ఈ నిర్ణయం తీసుకొంది. త్వరలోనే పరీక్షల నిర్వహణపై కొత్త తేదీని వెల్లడిస్తాం” ఎన్టీఏ పరీక్షల విభాగం సీనియర్ డైరెక్టర్ డాక్టర్ సాధనా పరాశర్ తెలిపారు.