అమెరికాలో గత కొన్నిరోజులుగా కురుస్తున్న మంచు తుఫానుతో జనజీవనం స్తంభించి పోయింది. రోడ్లు, ఇల్లు, పరిసరప్రాంతాలన్నీ మంచుతో నిండిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు విలవిలలాడుతన్నారు. తీవ్ర స్నోఫాల్‌తో, శీతల గాలులతో అమెరికా గజగజలాడిపోతోంది. ఇప్పుడిప్పుడే ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో.. న్యూయార్క్ లోని బఫెలో సిటీ కోలుకుంటోంది. మంచు తుఫాన్ తగ్గడంతో అధికారులు రోడ్లు రీఓపెన్ చేశారు. కాలనీల్లో పేరుకుపోయిన మంచును సిబ్బంది తొలగిస్తున్నారు .
ఇదిలా ఉంటే.. మంచు తుపాన్‌తో అతలాకుతలం అయిన బఫెలో సిటీ నుంచి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ ప్రాంతంలో.. ఓ ఇల్లు.. పక్కనే రోడ్డు.. మరో ఇంటి లాన్లో ఉన్న ప్లాస్టిక్ కుర్చీ.. గంటల వ్యవధిలో మంచులో కూరుకుపోయిన వీడియో ఇంటర్నెట్ను ప్రస్తుతం షేక్ చేస్తోంది. రెండు రోజుల సమయాన్ని కేవలం ఒకే ఒక్క నిమిషంలో పూర్తి చేసుకుంటే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపించారు.
48 hour timelapse of Blizzard in 60 seconds. pic.twitter.com/tPjrUFnmzR
— Weird and Terrifying (@weirdterrifying) December 29, 2022
వాతావరణ మార్పులతో ఇబ్బంది పడుతున్న ఆ ప్రాంతంలో ఓ వ్యక్తి క్రేజీగా ఆలోచించాడు. తన ఇంటి లాన్ లో రెండు రోజులపాటు టైమ్ ల్యాప్స్ తీశాడు. మొదట సాధారణంగా ఉన్న ఆ చోటు.. పూర్తిగా మంచు గుప్పిట్లోకి వెళ్లిన విధానాన్ని నిమిషం వీడియో రూపంలో తీశాడు. రెండు రోజులపాటుగా పని చేసిన కెమెరా.. అక్కడి దృశ్యాలను రికార్డు చేసింది. సోషల్ మీడియాలో వ్యూస్, లైకులు, షేర్లతో దూసుకుపోతున్న ఆ వీడియోను మీరూ చూసేయండి.