మార్స్‌పై వింత.. ఎర్రమట్టి, మంచు ( వీడియో ) - MicTv.in - Telugu News
mictv telugu

మార్స్‌పై వింత.. ఎర్రమట్టి, మంచు ( వీడియో )

July 8, 2020

gngn

అంగారక గ్రహంపై ఉన్న వింతను ఖగోళశాస్త్రవేత్తలు బయటపెట్టారు. అందరూ ఆశ్చర్యపోయే వీడియోను విడుదల చేశారు. దాంట్లో ఎర్రటి మట్టిలో తెల్లటి మంచు..చూడటానికి ఎంతో అందంగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ(ఈఎస్‌ఏ) దీన్ని విడుదల చేయడంతో నెటిజన్లు తెగ ఆసక్తిగా చూస్తున్నారు.ఎక్స్‌ప్రెస్ హై రిజల్యూషన్ స్టీరియో కెమెరాతో దీన్ని చిత్రీకరించినట్టు చెప్పారు. మార్స్‌పై మనుషులు జీవించేందుకు అనువైన వాతావరణం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిపై చాలా కాలంగా పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మంచుతో నిండి ఉన్న బిలం బయటపడటం విశేషం.  

గ్రహం ఉపరి తలంపై ఏర్పడిన ఈ బిలం చుట్టూ ఎర్రటి వలయం ఉంది. దానిలోపల మొత్తం మంచుతో కప్పబడి ఉంది. ఇది దాదాపు  82 కి.మీ వెడల్పుతో నార్త్‌ లోల్యాండ్ ప్రాంతంలో  ఉన్నట్టుగా పేర్కొన్నారు. దీంట్లో ఏడాది అంతా 1.8 కి.మీ మేర మందమైన మంచు నీటితో కప్పబడి ఉంటుందని పేర్కొన్నారు. ఈ బిలం శాస్త్రవేత్తలు పరిశోధనలకు ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా ఈ దృశ్యాలను చూసిన ఆశ్చర్యపోతూ సోషల్ మీడియాలో తమ అనుభవాలను పంచుకుంటున్నారు.