హిజ్రాతో ఎస్ఐ అక్రమ సంబంధం.. నగలతో పరార్ - MicTv.in - Telugu News
mictv telugu

హిజ్రాతో ఎస్ఐ అక్రమ సంబంధం.. నగలతో పరార్

May 20, 2019

Sub Inspector Cheats Hijra Babitha Roj in Tirunelveli Tamil nadu.

తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ ఎస్ఐ నగలు, నగదుతో పారిపోయి తనను పట్టిచుకోవడంలేదని ఎస్పీని ఆశ్రయించింది ఓ హిజ్రా. కలకలం రేపుతున్న ఈ ఘటన  తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో వెలుగు చూసింది.

రామచంద్రపట్టినం ప్రాంతానికి చెందిన బబితారోజ్ హిజ్రా.  హిజ్రాల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఈమె వారు సెక్స్ వర్క్ చేయొద్దని సోషల్ మీడియాలో ప్రచారం చేపట్టింది. దీంతో హిజ్రాలు ఆమెను దూషిస్తూ ఇంటి ముందు ధర్నాకు దిగారు. బబితకు భద్రత కల్పించేందుకు బావూరుసత్రం పోలీసు స్టేషన్‌ ఎస్ఐ వెళ్లాడు. అలా బబితకు,  ఎస్ఐకి వివాహేతర సంబంధం ఏర్పడింది. అప్పటికే పెళ్లయి పిల్లలు కూడా ఉన్న ఎస్ఐ.. బబితతో వేరు కాపురం పెట్టాడు. ఇటీవల అతడు వేరే స్టేషన్‌కు బదిలీ అయ్యాడు. బబితతో సంబంధాన్ని వదులుకున్నాడు. ఆమె ఫోన్ చేసినా మాట్లాడలేదు.

తనను మోసం చేశాడని గ్రహించిన బబిత.. జిల్లా ఎస్పీ అరుణ్ శక్తికుమార్ కు ఫిర్యాదు చేసింది. ఎస్ఐకి  వివాహమై, భార్యాపిల్లలు ఉన్నా.. తనతో పాటు కాపురం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ‘నేను అనేక సార్లు అతనికి బంగారం, నగదు ఇచ్చాను. కానీ నన్ను మోసం చేశాడు. అతనిపై చర్యలు తీసుకుని, నా నగలు, నగదు ఇప్పించాలి’ అని ఎస్పీని కోరింది.

దీనికి స్పందించిన ఎస్పీ.. వెంటనే నిందితుడిపై  విచారణ చేపట్టాలని డీఎస్పీకి ఉత్తర్వులు జారీ చేశారు. బబితను, ఎస్‌ఐని ఆదివారం పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.