వెరైటీగా.. నల్లగొండలో ఎస్ఐ ఇంటికే రంధ్రం - MicTv.in - Telugu News
mictv telugu

వెరైటీగా.. నల్లగొండలో ఎస్ఐ ఇంటికే రంధ్రం

August 10, 2020

Sub inspector robbed in nalgonda.

నల్గొండ జిల్లా కేంద్రంలో సీన్ రివర్స్ అయింది. పోలీసులను చూడగానే పారిపోయే దొంగలు… అదే పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఏకంగా రూ.20లక్షల విలువైన సొత్తు దొంగలించారు. దేవరకొండ రోడ్డు న్యూ చైతన్యపురి కాలనీలో ఎస్ఐ లాక్యా నాయక్ ఫ్యామిలీతో కలిసి నివాసముంటున్నారు. ఆయన భార్య సువర్ణ, కుమార్తె శ్రీలత పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లారు. ఎప్పటిలాగే లాక్యా నాయక్ ఇంటికి తాళం వేసి డ్యూటీ నిమిత్తం పోలీస్ స్టేషన్ వెళ్ళాడు. 

దీంతో దొంగలు తాళాన్ని పగలగొట్టి లోనికి ప్రవేశించారు. డూప్లికేట్ తాళంతో బీరువా ఓపెన్ చేసి అందులో ఉన్న 20.25 తులాల బంగారు ఆభరణాలు, రూ.8.50 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. తర్వాతి రోజు ఉదయం ఇంటి తలుపులు తెరచి ఉండటాన్ని గమనించిన స్థానికులు సువర్ణకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో ఆమె హుటాహుటిన హైదరాబాద్‌ నుంచి ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో దొంగతనం జరిగిందని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, వన్‌టౌన్‌ సీఐ నిగిడాల సురేష్‌ క్లూస్‌టీమ్‌తో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చోరీ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ సురేష్ తెలిపారు.