వాడో సబ్ ఇన్స్ పెక్టర్..కానీ ఆమె పాలిట యమగండం..! - MicTv.in - Telugu News
mictv telugu

వాడో సబ్ ఇన్స్ పెక్టర్..కానీ ఆమె పాలిట యమగండం..!

May 30, 2017

నలుగురికి రక్షణగా ఉండాల్సినోడు..ఇంట్లో పెళ్లాన్నే సరిగ్గా చూసుకోలేకపోతున్నాడు. పోలీస్ స్టేషన్లలో పదిమందికి చెప్పాల్సినోడు…అదే స్టేషన్ లో ఎఫ్ ఐ ఆర్ లోకి ఎక్కాడు. పెళ్లాన్ని ఇంట్లో టార్చర్ పెడుతూ వస్తోన్న ఓ ఎస్ ఐ ..ఫోన్ రికార్డింగ్ లతో సహా అడ్డంగా బుక్కయ్యాడు.. ఇంతకీ ఎవడా ఎస్ ఐ ..ఎమాకథ..?

ఈ ఫోటో లో కనిపిస్తోన్న ఇతని పేరు లక్ష్మారెడ్డి.. సంగారెడ్డిలో ఎస్ఐ గా పనిచేస్తున్నాడు. చక్కని ఉద్యోగంతో సంతోషంగా ఉండాల్సింది పోయి భార్య జ్యోతిని తెగ టార్చర్ పెడుతున్నాడు. ఎంతైనా పోలీసోడు కదా…తననెవడు అడుగుతాడనుకున్నాడో ఆమెకి నరకం చూపిస్తున్నాడు. అనుమానం తో ఇంటి నిండా సీసీ కెమేరాలు పెట్టేశాడు. ఇస్తే విడాకులు ఇవ్వు.. లేదంటే మన బెడ్ రూం వీడియోలు నెట్ లో పెడుతానంటూ బెదిరిస్తున్నాడట. అంతే కాదు మరో పెళ్లి చేసుకుంటే కోట్ల రూపాయల కట్నం వస్తుందంటూ సైకోలా ప్రవర్తిస్తున్నాడట. వీటిన్నంటికి ఆధారాలున్నాయంటూ ఎస్ ఐ భార్య జ్యోతి మల్కాజ్ గిరి పోలీస్ స్టేషన్ కెక్కింది. సీడీల్ని పోలీసులకు ఇచ్చేసింది. అందులో రాయడానికి వీల్లేని ఎస్ ఐ బూతు తిట్ల పురాణం ఉంది. వీడు మాములోడు కాదు..ఇంట్లో పెళ్లాన్నే కాదు…డిపార్ట్ మెంట్ ను తిట్టి తిట్టి పోశాడు. పీఎస్ లో ఉండే లేడీ కానిస్టేబుళ్లు..పీఎస్ కు వచ్చే మహిళల్ని కూడా వదలాడంటోంది అతని భార్య..ఇదే నిజమైతే ఇలాంటి శాడిస్ట్ పోలీస్ మొగుడుపై ఉన్నతాధికారులు ఏలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.